Bindyarani Devi | ఫుకెట్(థాయ్‌లాండ్): ప్రతిష్ఠాత్మక ఐడబ్ల్యూఎఫ్ వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచకప్‌లో భారత లిఫ్టర్ బింద్యారాణి దేవి కాంస్య పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 55కిలోల విభాగంలో బరిలోకి దిగిన బింద్యారాణి(83కి+113కి) మొత్తం 196కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ కాంగ్ హ్యాన్ (234కి), కాంబీ మిహిల (201కి) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. నాన్ ఒలింపిక్ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగిన బింద్యారాణి.. కామన్వెల్త్గేమ్స్ ప్రదర్శన(203కి)ను పునరావృతం చేయలేకపోయింది.