Jannik Sinner | జకోవిచ్‌ను ఓడించే దమ్మున్న ఆటగాళ్లు కొందరే.. వాళ్లలో నేను ఒకడిని : ఇటలీ టెన్నిస్ స్టార్
Jannik Sinner : టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వింబుల్డన్(Wimbledon 2023) టోర్నమెంట్ ఈరోజుతో మొదలుకానుంది. ఈసారి వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) టాప్ సీడ్‌గా, నొవాక్ జకోవిచ్(Novak Djokovic) బరిలోకి దిగుతున్నారు. అయితే.. 8వ సీడ్ జానిక్ సిన్నర్(Jannik Sinner) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వింబుల్డన్‌లో జకోవిచ్‌ను ఓడించే దమ్మున్న ఆటగాళ్లు కొందరేనని...
Jannik Sinner : టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వింబుల్డన్(Wimbledon 2023) టోర్నమెంట్ ఈరోజుతో మొదలుకానుంది. ఈసారి వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) టాప్ సీడ్‌గా, నొవాక్ జకోవిచ్(Novak Djokovic) బరిలోకి దిగుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరిలో ఒకరు చాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని టెన్నిస్ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. 8వ సీడ్ జానిక్ సిన్నర్(Jannik Sinner) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వింబుల్డన్‌లో జకోవిచ్‌ను ఓడించే దమ్మున్న ఆటగాళ్లు కొందరేనని, వాళ్లలోతాను ఒకడిని అని ఇటలీ స్టార్అన్నాడు. ‘నేను జకోను మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నా. నిరుడు కూడా అతడితో గట్టిగా పోరాడాను. గ్రాస్ కోర్టులో నాదైన ఆటను చూపించానంటే ఈసారి అతడికి ఓటమి తప్పదు’ అని సిన్నర్ తెలిపాడు. 2022 వింబుల్డన్ క్వార్ట్ ఫైనలో జకోవిచ్ చేతిలో సిన్నర్ అనూహ్యంగా ఓటమి చవిచూశాడు.
జకోవిచ్, జానిక్ సిన్నర్

మొదటి రెండు సెట్లు గెలిచిన అతను ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన జకో ఎనిమిదో టైటిల్‌పై కన్నేశాడు. ఒకవేళ అతను విజేతగా నిలిస్తే మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్(Roger Federer) రికార్డును సమం చేస్తాడు.
జకోవిచ్‌కు పోటీ వీళ్లే
ఈ ఏడాది ఆరంభం నుంచి జకోవిచ్ జోరు కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2023) టైటిల్ నెగ్గిన అతను ఫ్రెంచ్ ఓపెన్(French Open 2023) విజేతగా నిలిచాడు. దాంతో, అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మజీ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafeal Nadal) 22 గ్రాండ్ స్లామ్స్ రికార్డును బద్ధలు కొట్టాడు.
కార్లోస్ అల్కరాజ్

రెండో ర్యాంకర్ అయిన జకోకు ఈసారి వింబుల్డన్‌లో సులువైన డ్రా లభించింది. అయితే.. అల్కరాజ్, మెద్వెదేవ్, త్సిత్సిపాటి, ముర్రే నుంచి ఈ సెర్బియా స్టార్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈమధ్యే క్వీన్స్ క్లబ్(Queens Club) ట్రోఫీ ఫైనల్లో గెలిచిన అల్కరాజ్, జకోను వెనక్కి నెట్టి మళ్లీ వరల్డ్ నంబర్ 1 అయ్యాడు. ఇప్పటివరకూ గ్రాస్ కోర్టులో 4వ రౌండ్ దాటిన అతను ఈసారి టైటిల్ వేటలో అందరికంటే ముందున్నాడు. మరోవైపు.. తొడ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోని రఫెల్ నాదల్ ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

