Sachin Tendulkar: అండర్సన్ రిటైర్మెంట్.. గుడ్‌బై విషెస్ చెప్పిన సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar: జిమ్మీ అండర్సన్ బౌలింగ్‌ను ఎంజాయ్ చేసినట్లు సచిన్ తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు జిమ్మీ వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో సచిన్ తన ట్వీట్లో స్పందించాడు. గుడ్‌బై విషెస్ తెలిపాడు.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ .. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో అతను అల్విదా ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఆ గ్రేట్ బౌలర్‌కు తనదైన స్టయిల్లో ఫేర్వెల్ విషెస్ తెలిపాడు. జిమ్మీ బౌలింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేసినట్లు సచిన్ తన ట్వీట్లో వెల్లడించాడు. 188 టెస్టులు ఆడిన అండర్సన్ మొత్తం తన ఖాతాలో 704 వికెట్లు వేసుకున్నాడు.
22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నీ బౌలింగ్‌తో అందర్నీ బౌల్డ్ చేశావని జేమ్స్‌ను సచిన్ మెచ్చుకున్నాడు. ఆ స్పీడ్, యాక్షన్, అక్యురెసీ, స్వింగ్, ఫిట్నెస్ అద్భుతమని తన గుడ్‌బై సందేశంలో సచిన్ తెలిపాడు. నీ ఆట తీరుతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచావని కీర్తించాడు. ఆరోగ్యం, సంతోషంతో జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు సచిన్ కోరుకున్నాడు.
భారత్‌తో 39 టెస్టుల్లో అండర్సన్ ఆడాడు. వాటిల్లో అతను 149 వికెట్లు తీసుకున్నాడు. దీంట్లో ఆరు సార్లు అయిదేసి వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో సచిన్ టెండూల్కర్ 32 టెస్టుల్లో ఆడాడు. వాటిల్లో అతను 2535 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు సెంచరీలు, 13 ఫిఫ్టీలు ఉన్నాయి.
Hey Jimmy!
You’ve bowled the fans over with that incredible 22-year spell. Here’s a little wish as you bid goodbye.
It has been a joy to watch you bowl – with that action, speed, accuracy, swing and fitness. You’ve inspired generations with your game.
Wish you a wonderful life… pic.twitter.com/ETp2e6qIQ1
— Sachin Tendulkar (@sachin_rt) July 12, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

