దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఫినిషర్‌గా ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్‌కు చేరాడు.
యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 6వ స్థానంలో నిలువగా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో ఇషాన్ తప్ప మరో భారత ప్లేయర్ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా జరిగిన సఫారీల సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లో 41.00 సగటుతో ఇషాన్ 206 పరుగులు చేసిన విషయం తెలిసిందే.