IND vs IRE | టీ20ల్లో సంచలనం.. స్వదేశంలో భారత్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్..!
IND vs IRE : సంచలనాలకు నెలవైన టీ20ల్లో పెద్ద జట్టైన భారత్‌కు ఐర్లాండ్ (Ireland)ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ తొలి పోరులో టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది.
IND vs IRE : సంచలనాలకు నెలవైన టీ20ల్లో పెద్ద జట్టైన భారత్‌కు ఐర్లాండ్ (Ireland)ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ తొలి పోరులో టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. 183 పరుగుల ఛేదనలో హిట్టర్లతో నిండిన భారత జట్టు అలవోకగా గెలుస్తుందనుకుంటే.. ఐరిష్ బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. మాథ్యూ హొలార్డ్(3-28)తో మిడిలార్డర్‌ను దెబ్బతీయగా.. అభిషేక్ శర్మ(50),శివం దూబే(25) కాసేప పోరాడాడు. ఫలితంగా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆతిథ్య జట్టు.
టీ20 వరల్డ్‌కప్‌ను మూడుసార్లు ముద్దాడిన భారత్‌ను చిన్న జట్టైన ఐర్లాండ్ ఓడించింది. స్వదేశంలో బ్యాటుతో, బంతితో, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించిన ఐరిష్ టీమ్ సంచలన విజయంతో టీమిండియాకు షాకిచ్చింది. తొలుత ఆడిన ఐర్లాండ్. 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రికార్డు వీరులైన భారత బ్యాటర్ల ముందు ఈ లక్ష్యం ఏం నిలుస్తుంది అనుకున్న వారి అంచనాలు తప్పని ఐర్లాండ్ నిరూపించింది.
History in Belfast! 🇮🇪
Ireland have beaten India for the first time in international cricket, pulling off a famous victory over the world champions 👏 pic.twitter.com/5Nj8iQsuHi
— Cricinfo (@cricinfo) June 26, 2026
పొట్టి వరల్డ్‌కప్‌లో ఇరగదీసిన ఓపెనర్ సంజూ శాంసన్(5) బంతిని వికెట్ల మీదకు ఆడుకోగా.. ఇషాన్ కిషన్(1).. శ్రేయస్ అయ్యర్(3) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఐరిష్ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని అభిషేక్ శర్మ(50) అర్ధ శతకంతో నీరుగార్చాడు. కానీ బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో టీమిండియా హిట్లర్లకు కళ్లెం వేశారు. సుందర్(9), తిలక్ వర్మ(19) సైతం నిలబడలేదు.
Abhishek Sharma doing what he does best 💥
The #TeamIndia opener cruises to a 1️⃣9️⃣-ball FIFTY 👊
Updates ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND | @OfficialAbhi04 pic.twitter.com/b2semHbeOh
— BCCI (@BCCI) June 26, 2026
చూస్తుండగానే ఐదు వికెట్లు పడడంతో శివం దూబే(25), అక్షర్ పటేల్(15) గెలిపించే ప్రయత్నం చేశారు. ఏడో వికెట్‌కు 35 రన్స్ చేసిన దూబేను మూండ్రా రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. డెలానీ ఓవర్లో సిక్సర్ కొట్టే క్రమంలో టెక్టర్ చేతికి చిక్కాడు అక్షర్. దాంతో.. టీమిండియా ఓటమి ఖాయమైంది. సిక్సర్‌తో ఆశలు రేపిన హర్షిత్ రానా(8) బౌండరీ వద్ద దొరికగా.. 19వ ఓవర్ చివరి బంతికి అర్ష్‌దీప్ సైతం ఔటయ్యాడు. భారత్ 148కే ఆలౌటవ్వగా.. 34 రన్స్ తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది.
ఆదుకున్న టక్నర్, గెలానీ
భారత బౌలర్లు పంజా విసిరినా ఐర్లాండ్ భారీ స్కోర్ కొట్టింది. టాస్ ఓడిన జట్టుకు శుభారంభమివ్వాలనుకున్న ఓపెనర్ రాస్ అడైర్(12)ను ఔట్ చేసి హర్షిత్ రానా(3-24) తొలి వికెట్ అందివ్వగా.. హ్యారీ టెక్టర్(0)ను అర్ష్‌దీప్ సింగ్(2-28) పెవిలియన్ పంపాడు. తర్వాతి ఓవర్లో టిమ్ టెక్టర్(17)ను రానా డగౌట్ చేర్చగా 30 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో ఆచితూచి ఆడాలనుకున్న బెంజమిన్ కాలిట్జ్(15)ను దూబే బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ లొర్కాన్ టక్నర్(50), గరెత్ డెలానీ(49)లు ఆదుకున్నారు.

టపటపా నాలుగు వికెట్లు పడిన దశలో టక్నర్, డెలానీ నిలబడ్డారు. మరో వికెట్ పడకుండా.. రన్‌రేటు తగ్గకుండా స్కోర్ బోర్డును నడిపించారిద్దరూ. దూబే ఓవర్లో ఫోర్, డబుల్స్‌లో ఐరిష్ సారథి అర్ధ శతకం సాధించాడు. కానీ హర్షిత్ ఓవర్లో టక్నర్.. తిలక్ వర్మ చేతికి చిక్కడంతో 115 వద్ద ఐదో వికెట్ పడింది. డెత్ ఓవర్లలో గేర్ మార్చిన గెలానీ బౌండరీలు రాబట్టగా.. ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

