IPL 2023 | ఐపీఎల్ 2023 వేలంలో 991 మంది.. స్టార్ ఆటగాళ్ల కనీస ధర ఎంతో తెలుసా..?
ఈసారి వేలంలో 714 మంది భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ ఆటగాళ్లు
IPL 2023 : ఐపీఎల్ 2023 వేలం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరన్ రూ.2 కోట్ల కనీస ధరకు రిజిష్టర్ అయ్యారు. ఆస్ట్రేలియన్ యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొచ్చిలో డిసెంబర్ 23వ తేదీన ఐపీఎల్ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. వీళ్లలో 714 మంది భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
రూ.2 కోట్ల కనీస ధర : ఈ జాబితాలో బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్, కేన్ విలియమ్సన్, క్రిస్ లిన్, క్రిస్ జోర్డాన్, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్ వంటి స్టార్ ఆటాగాళ్లు ఉన్నారు. ఆదిల్ రషీద్, ట్రావిస్ హెడ్, టామ్ బాంటన్, టైమల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రేగ్ ఓవర్టన్, ఫిల్ సాల్ట్, ఆడం మిల్నే, జిమ్మీ నీషమ్, రిలీ రస్సో, రసీ వాన్ డెర్ డస్సెన్, ఏంజెలో మ్యాథ్యూస్‌లు రూ.2 కోట్ల కనీస ధరకు రిజిష్టర్ అయ్యారు. ఈ బేస్ ధరలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.
రూ.కోటిన్నర కనీస ధర : సీన్ అబాట్, రిలే మెరిడిత్, రిచర్డ్సన్, ఆడం జంపా, సకిబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్.
రూ.కోటి కనీస ధర : మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహమాన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గుఫ్తిల్, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లసెన్, తబ్రేజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ ఛేజ్, రకీం కార్న్‌వాల్, షై హోప్, డేవిడ్ వీసె, అకీల్ హోసెయిన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

