KKR | కేకేఆర్ విజయంలో హీరో..! ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ ఫీజులో 60శాతం కోత..!
KKR | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) విజయం సాధించింది. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆఖరి ఎవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గెలుపులో కీలక పాత్ర పోషించిన బౌలర్‌కు మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు.
KKR | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) విజయం సాధించింది. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆఖరి ఎవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గెలుపులో కీలక పాత్ర పోషించిన బౌలర్‌కు మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు. మ్యాచ్‌లో సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. కోల్‌కతాలోని ఈడెన్గార్డెన్లో హైదరాబాద్‌తో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది.
కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసి.. ప్రత్యర్థి సన్‌రైజర్స్ జట్టుకు 209 విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. మయాంక్, అభిషేక్ శర్మ జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి 5.3 ఓటర్లలో 60 పరుగులు చేశారు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హర్షిత్ తొలుత మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు. వికెట్‌ను తీసిన ఆనందంలో మయాంక్ దగ్గరకు వెళ్లి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అయితే, మయాంక్ ఏమీ అనకుండా బౌలర్‌ను చూస్తూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
ఇక ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ జట్టుకి 13 పరుగులు కావాల్సి ఉండగా.. హర్షిత్ రాణా వేసిన తొలి బంతిని క్లాసెన్ సిక్సర్‌గా మలిచాడు. హైదరాబాద్ జట్టును క్లాసెన్ విజయం ముంగిట వరకు తీసుకువచ్చిన క్లాసెన్.. ఆ తర్వాత మరో భారీ షాట్ ఆడేందుకు యత్నించి సుయాష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా చివరి ఐదుబంతుల్లో కేవలం రెండు పరుగులు ఇచ్చి 20 వికెట్లు కూల్చి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్‌లో బౌలర్ వ్యవహరశైలిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1ని రెండుసార్లు ఉల్లంఘించినందుకు 60శాతం జరిమానా విధించారు.
Sealed with a kiss 🫣
Watch #KKRvSRH with #IPLonJioCinema now in Bengali 🤩#TATAIPL #IPL2024 #JioCinemaSports pic.twitter.com/w2mf87HVa0
— JioCinema (@JioCinema) March 23, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

