IPL 2023 | ఇంపాక్ట్ ప్లేయర్స్‌లో కొందరే హిట్.. ఇంపాక్ట్ చూపనిది వీళ్లే
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కంటే ముందు నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నియమం(Impact Player Rule) అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. వీళ్లు నిజంగానే ఇంపాక్ట్ చూపిస్తున్నారా? మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారా? అనేది చూద్దాం. వీళ్లలో కొందరే హిట్టయ్యారు. మిగతావాళ్లంతా అంచనాలను అందుకోలేకపోయారు.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. హోరాహోరీ పోరాటాలు, విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఈ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. టోర్నీ ఆరంభం కంటే ముందు నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నియమం(Impact Player Rule) అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. వీళ్లు నిజంగానే ఇంపాక్ట్ చూపిస్తున్నారా? మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారా? అనేది చూద్దాం. వీళ్లలో కొందరే హిట్టయ్యారు. మిగతావాళ్లంతా అంచనాలను అందుకోలేకపోయారు. ఇప్పటి వరకు18 మంది ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా బరిలోకి దిగారు
హిట్టయ్యింది వీళ్లే
ఇంపాక్ట్ ప్లేయర్స్‌లో కొందరే హిట్టయ్యారు. తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ధ్రువ్ జెరెల్స్(Rajasthan Royals) ఓటమి అంచులో ఉన్న జట్టును గెలిపించినంత పని చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే 32 రన్స్ చేసి పంజాబ్ కింగ్స్‌ను వణికించాడు. అయితే.. పంజాబ్ 5 పరుగులతో గెలిచింది.

Dhruv F
కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సుయాశ్ శర్మ(Suyash Sharma) ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఈ 19 ఏళ్ల లెగ్ స్పిన్నర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో భాగమయ్యాడు. తుషార్ దేశ్పాండ్(CSK) లక్నో సూపర్ జెయింట్స్‌పై 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో, చెపాక్ స్టేడియంలో సీఎస్కే 12 పరుగుల తేడాతో నెగ్గింది. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటన్స్) సీఎస్కేపై 22 రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడు. విజయ్ శంకర్ (గుజరాత్ టైటన్స్) ఢిల్లీ క్యాపిటల్స్‌పై విలువైన 29 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్(సన్ రైజర్స్ హైదరాబాద్) రాజస్థాన్ రాయల్స్‌పై 32 నాటౌట్‌గా నిలిచాడు.

Vijay Shankar F
వీళ్ల ఇంపాక్ట్ లేదు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(KKR) ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. కానీ, అతను చెలరేగి ఆడలేకపోయాడు. 28 బంతుల్లో 34 రన్స్ చేసి నిరాశ పరిచాడు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అమన్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), అనుజ్ రావత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), రిషి ధావన్ (పంజాబ్ కింగ్స్), నవ్‌దీప్ సైనీ (రాజస్థాన్ రాయల్స్) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | ఐపీఎల్‌కు దూరమైన ఆర్సీబీ స్టార్ పేసర్.. జట్టులోకి పార్నెల్, విజయ్ కుమార్
Cricket coach: లైంగిక వేధింపుల ఆరోపణలపై క్రికెట్ కోచ్ అరెస్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

