IPL 2023 | ముంబై ఇండియన్స్ VS గుజరాత్ టైటన్స్ అప్డేట్స్
IPL 2023 : పదహారో సీజన్లో ఐపీఎల్ 35వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ నాలుగు విజయాలతో జోరు మీద ఉంది. ఓటమితో టోర్నీని ఆరంభించిన ముంబై హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. కానీ, గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
IPL 2023 : పదహారో సీజన్లో ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ హవా కొనసాగిస్తోంది. సొంత గ్రౌండ్లో గుజరాత్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో ముంబైపై 55 పరగులు తేడాతో గెలిచింది. ముంబై వరుసగా రెండోసారి రెండొందల టార్గెట్‌ను ఛేదించలేక చతికిల పడింది.
భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆదిలోనే షాక్. కెప్టెన్ రోహిత్ శర్మ(2) హార్దిక్ పాండ్యా ఓవర్లో ఔటయ్యాడు. మొదటి నుంచి తడబడుతున్న ఇషాన్ కిషన్(13)ను పెవిలియన్ పంపిన రషీద్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మ(2)ను ఎల్బీగా ఔట్ చేశాడు. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో కామెరూన్ గ్రీన్(30), టిమ్ డేవిడ్(0)ను ఔట్ చేయడంతో ముంబై 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. నూర్ అహ్మద్13వ ఓవర్లో డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(23)ను ఔట్ చేసి ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టాడు. నేహల్ వధేరా(40), పీయూష్ చావ్లా(18) పోరాడడంతో రోహిత్ సేన పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.
Cameron Green ✅
Tim David ✅Further trouble for Mumbai Indians as Noor Ahmad scalps two wickets in an over 🔥🔥
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/p9sJhipW1X
— IndianPremierLeague (@IPL) April 25, 2023
గిల్ ఫిఫ్టీ.. అభినవ్, మిల్లర్ విధ్వంసం
సొంత మైదానంలో గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(56) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్(42), డేవిడ్ మిల్లర్(46) సిక్సర్ల మోత మోగించారు. దాంతో, గుజరాత్ 207 పరుగలు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు మూడో ఓవర్లో అర్జున్ టెండూల్కర్ షాకిచ్చాడు. తొలి బంతికే వృద్ధిమాన్ సాహా(4)ను ఔట్ చేశాడు. మూడో స్థానంలో హార్దిక్ పాండ్యా(13) విఫలమయ్యాడు. శుభ్‌మన్ గిల్(56) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ధాటిగా ఆడే క్రమంలో కార్తికేయ ఓవర్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్(42), డేవిడ్ మిల్లర్(46) దంచి కొట్టారు. ఐదో వికెట్‌కు 71 రన్స్ జోడించారు. రాహుల్ తెవాటియా(20) చివర్లో సిక్సర్లతో హోరెత్తించాడు. ముంబై బౌలర్లలో చావ్లా రెండు, రిలే మెరిడిత్, అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు.
-
25 Apr 2023 11:20 PM (IST)
ముంబైని చిత్తు చేసిన గుజరాత్
పదహారో సీజన్లో ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ హవా కొనసాగిస్తోంది. సొంత గ్రౌండ్లో గుజరాత్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఆ తర్వాత బౌలర్లు చెలరేగడంతో ముంబైపై 55 పరగులు తేడాతో గెలిచింది. ముంబై వరుసగా రెండోసారి రెండొందల టార్గెట్‌ను ఛేదించలేక చతికిల పడింది.
-
25 Apr 2023 11:08 PM (IST)
వధేరా ఔట్
నేహల్ వధేరా(40) ఔటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. స్లిప్‌లో షమీ క్యాచ్ పట్టడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది.
-
25 Apr 2023 11:07 PM (IST)
చావ్లా రనౌట్.. ఏడో వికెట్ డౌన్
ముంబై ఏడో వికెట్ పడింది. పీయూష్ చావ్లా(18) రనౌటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో చావ్లా రన్‌కు ప్రయత్నించాడు. కాననీ, నేహల్ సిద్ధంగా లేడు. సాహా నుంచి బంతి అందుకున్న మోహిత్ వికెట్లను గిరాటేశాడు.
-
25 Apr 2023 11:03 PM (IST)
నేహల్ క్యాచ్ వదిలేసిన పాండ్యా
షమీ బౌలింగ్‌లో నేహల్ వధేరా(39)కు లైఫ్ దొరికింది. మిడాన్‌లో పాండ్యా క్యాచ్ వదిలేశాడు. పీయూష్ చావ్లా(18) ఆడుతున్నాడు. 17 ఓవర్లకు స్కోర్..135/6
-
25 Apr 2023 10:53 PM (IST)
ముంబై స్కోర్ వంద
జోష్ లిటిల్ బౌలింగ్‌లో నేహల్ వధేరా(26) బౌండరీ కొట్టాడు. దాంతో ముంబై స్కోర్ వంద దాటింది. పీయూష్ చావ్లా(8) ఆడుతున్నాడు. 15 ఓవర్లకు స్కోర్..112/6
-
25 Apr 2023 10:41 PM (IST)
బిగ్ వికెట్ తీసిన నూర్ అహ్మద్
నూర్ అహ్మద్ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(23)ను ఔట్ చేశాడు. దాంతో, ముంబై వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది. నేహల్ వధేరా(12) ఆడుతున్నాడు.
W.O.W 😲
Noor Ahmad takes a superb catch off his own bowling 🙌🏻
Suryakumar Yadav departs for 23. #TATAIPL | #GTvMI pic.twitter.com/FNyLMmn4lP
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 10:37 PM (IST)
సూర్య జోరు
సూర్యకుమార్ యాదవ్(19) జోరు పెంచాడు. రషీద్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదాడు. నేహల్ వధేరా(1) ఆడుతున్నాడు. 12 ఓవర్లకు స్కోర్..75/5
-
25 Apr 2023 10:30 PM (IST)
సగం వికెట్లు కోల్పోయిన ముంబై
నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో టిమ్ డేవిడ్(0) ఔటయ్యాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడిన అతను మనోహర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మూడో బంతికి కామెరూన్ గ్రీన్(30) బౌల్డయ్యాడు. సూర్యకుమార్ యాదవ్(1), నేహల్ వధేరా ఆడుతున్నారు. 11 ఓవర్లకు స్కోర్.. 59/5
Cameron Green ✅
Tim David ✅Further trouble for Mumbai Indians as Noor Ahmad scalps two wickets in an over 🔥🔥
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/p9sJhipW1X
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 10:20 PM (IST)
9 ఓవర్లకు స్కోర్ 53
నూర్ అహ్మద్ వేసిన 9వ ఓవర్లో కామెరూన్ గ్రీన్(30) సిక్స్ బాదాడు. సూర్యకుమార్ యాదవ్(1) ఆడుతున్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 53/3 డు.ఓపెనర్ ఇషాన్ కిషన్(13) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో జోష్ లిటిల్ చేతికి చిక్కి వెనుదిరిగాడు.
-
25 Apr 2023 10:14 PM (IST)
రషీద్‌కు రెండో వికెట్
రషీద్ ఖాన్ దెబ్బకు ముంబై మూడో వికెట్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మ(2) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, రెండు పరుగుల వ్యవధిలో ముంబై కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్(23) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 45/3
-
25 Apr 2023 10:09 PM (IST)
ముంబై రెండో వికెట్ పడింది
ముంబై రెండో వికెట్ పడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(13) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో జోష్ లిటిల్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా తిలక్ వర్మ వచ్చాడు. కామెరూన్ గ్రీన్(23) ఆడుతున్నాడు.
-
25 Apr 2023 10:01 PM (IST)
పవర్ ప్లేలో 29 పరుగులు
ముంబై పవర్ ప్లేలో 29 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో 3 రన్స్ వచ్చాయంతే. కామెరూన్ గ్రీన్(12), ఓపెనర్ ఇషాన్ కిషన్(10) ఆడుతున్నారు.
-
25 Apr 2023 09:51 PM (IST)
గ్రీన్ సిక్స్
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్(9) సిక్స్ బాదాడు. నాలుగో బంతికి బై రూపంలో బౌండరీ వచ్చింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(2) ఆడుతున్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 18/1
-
25 Apr 2023 09:42 PM (IST)
ముంబైకి షాక్.. రోహిత్ ఔట్
ముంబైకి షాక్... హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో రోహిత్ శర్మ(2) ఔటయ్యాడు. ఆఖరి బంతికి షాట్ ఆడబోయి పాండ్యాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
25 Apr 2023 09:36 PM (IST)
తొలి ఓవర్లో 2 రన్స్
షమీ వేసిన తొలి ఓవర్లో 2 రన్స్ వచ్చాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్(0), రోహిత్ శర్మ(1) ఆడుతున్నారు.
-
25 Apr 2023 09:17 PM (IST)
గిల్, అభినవ్, మిల్లర్ విధ్వసం.. ముంబై టార్గెట్ 208
బెహ్రన్‌డార్ఫ్ వేసిన 20వ ఓవర్లో రాహుల్ తెవాటియా(20) తొలి రెండు బంతులకు సిక్స్‌లు బాదాడు.దాంతో, గుజరాత్ స్కోర్ రెండొందలు దాటింది. ఐదో బంతికి భారీ షాట్ ఆడిన డేవిడ్ మిల్లర్ (46) సూర్య చేతికి చిక్కాడు. ఆఖరి బంతికి రషీద్ ఖాన్(2) రెండు రన్స్ తీశాడు. దాంతో 6 వికెట్ల నష్టానికి గుజరాత్ 207 పరుగులు చేసింది.
2️⃣2️⃣ runs off the 18th over 🔥🔥
Abhinav Manohar departs after a quick-fire 42(21) 💪🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/kmfrCcEXir
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 09:05 PM (IST)
ఐదో వికెట్ డౌన్
గుజరాత్ ఐదో వికెట్ పడింది. దంచుతున్న అభినవ్ మనోహర్(42) ఔటయ్యాడు. మెరిడిత్ ఓవర్లో షాట్‌కు ప్రయత్నించి బెహ్రన్‌డార్ఫ్ చేతికి చిక్కాడు. దాంతో, 71 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
-
25 Apr 2023 09:02 PM (IST)
మనోహర్ సిక్సర్ల మోత
అభినవ్ మనోహర్(42) సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు దంచాడు. ఆఖరి బంతిని డేవిడ్ మిల్లర్(34) స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 22 రన్స్ వచ్చాయి. 18 ఓవర్లకు స్కోర్.. 172/4
-
25 Apr 2023 08:50 PM (IST)
మనోహర్, మిల్లర్ విధ్వంసం
రిలే మెరిడిత్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్(29), డేవిడ్ మిల్లర్(25) చెరొక బౌండరీ కొట్టారు. దాంతో, ముంబై స్కోర్ 150 చేరింది. 17 ఓవర్లకు స్కోర్.. 150/4
-
25 Apr 2023 08:45 PM (IST)
మనోహర్ వీర బాదుడు
అభినవ్ మనోహర్(18) బాదుతున్నాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ బాదాడు. డేవిడ్ మిల్లర్(17) ఆడుతున్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 130/4
-
25 Apr 2023 08:41 PM (IST)
మిల్లర్ దూకుడు
డేవిడ్ మిల్లర్(16) బాదుతున్నాడు. కార్తికేయ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. అభినవ్ మనోహర్(2) ఆడుతున్నాడు. 14 ఓవర్లకు స్కోర్.. 113/4
-
25 Apr 2023 08:35 PM (IST)
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
శుభ్‌మన్ గిల్(56) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత కార్తికేయ ఓవర్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
Half-century number 1️⃣7️⃣ for @ShubmanGill 😎
He's in fine touch as @gujarat_titans move to 84/2 at the halfway stage 👊🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/rAUftUHMYN
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 08:15 PM (IST)
8 ఓవర్లకు స్కోర్ 60
స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో గుజరాత్ పరుగుల వేగం తగ్గింది. కుమార్ కార్తికేయ ఓవర్లో 5 రన్స్ వచ్చాయి. శుభ్‌మన్ గిల్(38), విజయ్ శంకర్(2) ఆడుతున్నారు. 8 ఓవర్లకు స్కోర్.. 60/2
-
25 Apr 2023 08:05 PM (IST)
పాండ్యా ఔట్
గుజరాత్ రెండో వికెట్ పడింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా(13) క్యాచ్ ఔటయ్యాడు. లాంగాన్‌లో పాండ్యా కొట్టిన బంతిని బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్(31), విజయ్ శంకర్ ఆడుతున్నారు.
-
25 Apr 2023 08:02 PM (IST)
దంచుతున్న గిల్.. గుజరాత్ స్కోర్ 50
శుభ్‌మన్ గిల్(31) దంచుతున్నాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు, లాంగాఫ్‌లో 85 మీటర్ల సిక్స్ కొట్టాడు. 17 రన్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యా(13) ఆడుతున్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్.. 50/1
-
25 Apr 2023 07:58 PM (IST)
ఐదు ఓవర్లకు స్కోర్.. 33
రిలే మెరిడిత్ బౌలింగ్‌లో రెండో బంతికి శుభ్‌మన్ గిల్(16) బౌండరీ కొట్టాడు. రెండు వైడ్స్‌తో కలిపి 10 రన్స్ వచ్చాయి. హార్దిక్ పాండ్యా(11) ఆడుతున్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్.. 33/1
-
25 Apr 2023 07:42 PM (IST)
గుజరాత్‌కు షాక్.. సాహా వికెట్ తీసిన అర్జున్
అర్జున్ టెండూల్కర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే వృద్ధిమాన్ సాహా(4) ఔటయ్యాడు. కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టడంతో అంపైర్ ఔటిచ్చాడు. అయితే.. సాహా రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. దాంతో, 12 రన్స్ వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
There's the first wicket for @mipaltan 🙌🏻
Arjun Tendulkar with the opening breakthrough 💪🏻
Wriddhiman Saha departs for 4.
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/Y0i3UrfeBn
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 07:39 PM (IST)
గిల్ బౌండరీ
బెహ్రన్‌డార్ఫ్ వేసిన రెండో ఓవర్లో శుభ్‌మన్ గిల్(8) బౌండరీ కొట్టాడు. 8 రన్స్ వచ్చాయి. వృద్ధిమాన్ సాహా(4), ఆడుతున్నారు. రెండు ఓవర్లకు స్కోర్.. 12/0
-
25 Apr 2023 07:34 PM (IST)
తొలి ఓవర్లో 4 రన్స్
అర్జున్ టెండూల్కర్ వేసిన తొలి ఓవర్లో4 రన్స్ వచ్చాయి. వృద్ధిమాన్ సాహా(3), శుభ్‌మన్ గిల్(1) ఆడుతున్నారు.
-
25 Apr 2023 07:18 PM (IST)
సాహా 150.. షమీ100
గుజరాత్ టైటన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాకు ఇది 150వ మ్యాచ్. పేసర్ షమీకి వందో గేమ్. దాంతో, టీమ్ సభ్యులంతా వాళ్లకు కంగ్రాట్స్ తెలిపారు. సాహాకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, షమీకి మోహిత్ శర్మ మెమొంటోస్ అందజేశారు.
1️⃣0️⃣0️⃣th Match for @MdShami11 ✅
1️⃣5️⃣0️⃣th Match for @Wriddhipops ✅Congratulations to the @gujarat_titans duo 👏🏻👏🏻
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/gPhXKOjrkw
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 07:13 PM (IST)
సబ్స్టిట్యూట్స్ వీళ్లే
ముంబై సబ్స్టిట్యూట్స్ : రమన్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, సందీప్ వారియర్.
గుజరాత్ సబ్స్టిట్యూట్స్ : జోష్ లిటిల్, దసున్ శనక, శివం మావి, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, శ్రీకర్ భరత్.
A look at the Playing XIs of both sides 👌👌
Follow the match ▶️ https://t.co/PXDi4zeBoD#TATAIPL | #GTvMI pic.twitter.com/z2sPKaRfsx
— IndianPremierLeague (@IPL) April 25, 2023
-
25 Apr 2023 07:07 PM (IST)
ముంబై జట్టులో రెండు మార్పులు
ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. పేసర్ జోఫ్రా ఆర్చర్ స్థానంలో రిలే మెరిడిత్ వచ్చాడు. స్పిన్నర్ హృతిక్ షోకీన్ ప్లేస్‌లో కుమార్ కార్తికేయ ఆడుతున్నాడు. గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ పాండ్యా తెలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆడిన 11మంది ప్లేయర్స్‌నే గుజరాత్ కొనసాగించనుంది.
-
25 Apr 2023 07:02 PM (IST)
టాస్ గెలిచిన ముంబై
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

