IPL 2023, DC Vs KKR | ఖాతా తెరిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్‌కతాపై విజయం
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది.
- రాణించిన వార్నర్, ఇషాంత్, అక్షర్
వరుస పరాజయాలతో సతమతమైన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో ఖాతా తెరిచింది. ఐదు ఓటముల అనంతరం కోల్‌కతాపై ఢిల్లీ చచ్చీ చెడి విజయం సాధించింది. వర్షం కారణంగా బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట ఢిల్లీ బౌలర్లు విజృంభించడంతో కోల్‌కతా స్వల్ప స్కోరుకే ఆలౌట్ కాగా.. ఛేదనలో టెస్టు మ్యాచ్‌ను తలపించిన ఢిల్లీ చివరకు గెలుపు రుచిచూసింది.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. వర్షం అంతరాయం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన పోరులో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన జాసెన్ రాయ్ (43; 5 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో రస్సెల్ (38 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరితో పాటు మన్దీప్ సింగ్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. లిటన్ దాస్ (4), వెంకటేశ్ అయ్యర్ (0), కెప్టెన్ నితీశ్ రాణా (4), రింకూ సింగ్ (6), సునీల్ నరైన్ (4) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ ఐపీఎల్లో ఇషాంత్‌కు ఇదే తొలి మ్యాచ్. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు కోల్పోయి 128 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 57; 11 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. పృథ్వీ షా (13), మిషెల్ మార్ష్ (2), ఫిల్ సాల్ట్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో మనీశ్ పాండే (21), అక్షర్ (19 నాటౌట్) పోరాడారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, నితీశ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 127 ఆలౌట్ (రాయ్ 43, రస్సెల్ 38 ఆలౌట్; అక్షర్ 2/13, కుల్దీప్ 2/15), ఢిల్లీ: 19.2 ఓవర్లలో 128/6 (వార్నర్ 57, పాండే 21; రాణా 2/16, రాణా 2/17).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

