AB de Villiers | ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ తన విభిన్నమైన డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడుతూ మిస్టర్ 360గా గుర్తింపును పొందాడు. టీ20 క్రికెట్లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆర్సీబీతో పాటు పలు ఫ్రాంచైజీల తరఫున ఆడి డివిలియర్స్ భారత్‌లోనూ అభిమాలను సంపాదించుకున్నాడు.
అయితే, ఏబీడీ తన ఆల్‌టైమ్ గ్రేట్ టీ20 ఆటగాడి పేరును ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, ఏ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా పేరు చెప్పాడని అనుకునేరు. ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన ఆల్‌టైమ్ గ్రేట్ టీ20 ప్లేయర్ అని ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో రషీద్ ఖాన్ పేరు మారుమోగింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ప్రస్తుతం.. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. గతేడాది ఫ్రాంచైజీని చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ టీమ్ సభ్యులు.. విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్‌ను కాదని రషీద్ ఖాన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ టీ20 ప్లేయర్‌గా ఎంపిక చేశాడు. ఇందుకు గల కారణాలను వివరించాడు. సూపర్ స్పోర్ట్స్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా రషీద్ మ్యాచ్ విన్నర్‌గా పేర్కొన్నాడు. అతను బ్యాట్‌తో పాటు బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడన్నాడు. రెండు విభాగాల్లోనూ రషీద్ మ్యాచ్ విన్నర్ అని, అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు మాత్రమే కాదని.. అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు.
మైదానంలో రషీద్ శక్తివంతమైన ఆటగాడని, సింహం వంటి గుండెను కలిగి ఉన్నాడంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉండగా.. రషీద్ ఖాన్ టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున టీ20లోకి అరంగ్రేటం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 382 వివిధ లీగ్‌లో పాల్గొని.. 514 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 2017లో ప్రవేశించిన రషీద్.. ఇప్పటి వరకు 92 మ్యాచ్‌లు ఆడి.. 112 వికెట్లు పడగొట్టాడు. 2021 సీజన్ వరకు హైదరాబాద్‌కు ఆడిన రషీద్‌ను గత సీజన్లో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ ప్యాండ్యా, శుభ్‌మన్ గిల్‌తో పాటు డ్రాఫ్ట్ విధానంలో తీసుకున్నది.