INDvsSA: సఫారీ బోర్డు ఆర్థిక కష్టాలను తీర్చనున్న భారత్.. మూడు ఫార్మాట్ల సిరీస్‌ల ద్వారా భారీ ఆదాయం!
INDvsSA: సౌతాఫ్రికా బోర్డు గత కొన్నాళ్లుగా ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నది. అయితే భారత్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్ ద్వారా సుమారు మూడేండ్ల నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందని స్థానిక క్రికెట్ పండితులు చెబుతున్నారు.
INDvsSA: భారత్‌లో క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న బీసీసీఐ.. ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఆదాయంపరంగా బీసీసీఐతో సరితూగే బోర్డు దరిదాపుల్లో కూడా లేదు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో సుమారు 1/3వ వంతు బీసీసీఐ నుంచి వచ్చేదే. భారత్‌లోనే కాదు.. ఇతర దేశాల్లో భారత జట్టు క్రికెట్ ఆడినా ఆ బోర్డులకు కాసుల గలగలలే.. ఇదే క్రమంలో త్వరలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడబోయే టీమిండియా, దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (సీఎస్ఎ) మూడేండ్ల నష్టాల నుంచి బయటపడేయనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
సౌతాఫ్రికా బోర్డు గత కొన్నాళ్లుగా ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నది. అయితే భారత్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్ ద్వారా సుమారు మూడేండ్ల నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందని స్థానిక క్రికెట్ పండితులు చెబుతున్నారు. మూడు ఫార్మాట్లలో భారత్ సుమారు 30 రోజుల పాటు సౌతాఫ్రికాలోనే గడపాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో భారత్‌తో ఆడే మ్యాచ్‌ల ద్వారా సౌతాఫ్రికాకు 68.7 యూఎస్ మిలియన్ డాలర్ల ఆదాయం చేకూరనున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో మ్యాచ్ ద్వారా 8.6 యూఎస్ మిలియన్ డాలర్ల ఆదాయం రానుందని అంచనా.
క్రికెట్ సౌతాఫ్రికా గత మూడేండ్లలో తమ నష్టాలను 6.3 మి.డా, 10.5 మి.డా, 11.7 మి.డా నష్టాలను చవిచూసింది. భారత్‌తో సిరీస్‌ల ద్వారా ఈ నష్టాలను పూడ్చుకోనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ ద్వారా విశ్వవ్యాప్తమైన భారత క్రికెటర్ల ఆటను చూడటానికి వచ్చేవారిలో సౌతాఫ్రికా అభిమానులు కూడా ఉన్నారు. తద్వారా సౌతాఫ్రికా బోర్డు నష్టాల నుంచి బయటపడే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ ఏడాది నుంచి సౌతాఫ్రికాలో మొదలైన ఎస్ఎ 20 (టీ20 లీగ్) ద్వారా ఆ బోర్డును భారత్ ఆదుకున్న విషయం తెలిసిందే. ఎస్ఎ 20లో ఉన్న ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

