INDvsSA 1st ODI: టీమిండియా అలవోక విజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి
INDvsSA 1st ODI: తొలి వన్డేలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని యువ భారత్ అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత్.. సఫారీలను 116 పరుగులకే కట్టడి చేసింది. భారత్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు.
INDvsSA 1st ODI: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య న్యూవాండరర్స్ (జోహన్నస్బర్గ్)వేదికగా జరిగిన తొలి వన్డేలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని యువ భారత్ అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత్.. సఫారీలను 116 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేదనలో 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ (43 బంతుల్లో 55 నాటౌట్, 9 ఫోర్లు) తో పాటు వన్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్సర్) లు లక్ష్యాన్ని అవలీలగా ఛేదించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది.
స్వల్ప ఛేదనలో భాగంగా భారత్.. నాలుగో ఓవర్లో 23 పరుగుల వద్ద ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను కోల్పోయింది. వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌తో జతకలిసిన సాయి.. దక్షిణాఫ్రికాకు మరో అవకాశమే లేకుండా ఆడాడు. క్రీజులో కుదురుకునేదాకా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమైన అతడు.. షంసీ వేసిన 13వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. మరోవైపు ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీకి తరలించిన అయ్యర్ కూడా అడపాదడపా ఫోర్లు బాదుతూనే వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశాడు.
పెహ్లూక్వాయో వేసిన 16వ ఓవర్లో తొలి బంతికే బౌండరీ బాది 49 పరుగులకు చేరుకున్న సాయి.. రెండో బాల్‌ను డీప్ స్క్వేర్‌లెగ్ దిశగా ఆడి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్ తీసుకున్న శ్రేయస్.. లేట్ చేయకుండా ముగించాలని చూశాడు. వరుసగా ఫోర్, సిక్సర్ బాది అర్థ సెంచరీ బాదాడు. కానీ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కడంతో 88 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ తిలక్ వర్మ (1 నాటౌట్)తో కలిసి సాయి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు అర్ష్‌దీప్ ఐదు వికెట్లు, అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా 116 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య మంగళవారం (డిసెంబర్ 19న) రెండో వన్డే జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

