INDvsAUS T20I: లెఫ్ట్ హ్యాండర్ల వీరవిహారం.. ఆసీస్ ఎదుట భారీ లక్ష్యం
INDvsAUS T20I: టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్ వీరవిహారానికి తోడు రుతురాజ్ గైక్వాడ్ నిలకడైన ఆట తోడవడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
INDvsAUS T20I: తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు దంచికొట్టింది. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (25 బంతుల్లో 53, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో52, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడైన ఆట తోడవడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆఖర్లో రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బాదడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. మరి భారత బౌలర్లు ఈ లక్ష్యాన్ని ఏ మేరకు కట్డడిచేయగలరో చూడాలి.
యశస్వీ బాదుడు..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు జైస్వాల్-గైక్వాడ్‌లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టోయినిస్ వేసిన తొలి ఓవర్లోనే గైక్వాడ్ బౌండరీ కొట్టి పరుగుల ఖాతా తెరవగా మూడో ఓవర్ నుంచి యశస్వీ వీరవిహారం మొదలైంది. మ్యాక్స్‌వెల్ వేసిన ఆ ఓవర్లో రెండు బౌండరీల కొట్టిన జైస్వాల్.. సీన్ అబాట్ వేసిన మరుసటి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ వేసిన ఆరో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. 24 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న జైస్వాల్.. అదే ఓవర్లో ఐదో బంతికి జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇషాన్ కూడా వదల్లేదు..
జైస్వాల్ బాదుడు ముగిసిన వెంటనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ మొదలుపెట్టాడు. గైక్వాడ్‌తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత స్కోరు 10 ఓవర్లకే 101 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ వేసిన 14వ ఓవర్లో 6, 4, 6తో 23 పరుగులు రాబట్టాడు. సంఘా వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్స్రలు బాది 29 బంతుల్లో హాఫ్ సెంచీర పూర్తిచేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికే భారత్ స్కోరు 164 పరుగులు చేసింది. స్టోయినిస్ వేసిన 16వ ఓవర్లో ఇషాన్.. నాథన్ ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆఖర్లో రింకూ..
యశస్వీ,ఇషాన్‌ల స్ఫూర్తితో సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో19, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఎదుర్కున్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. నిలకడగా ఆడిన రుతురాజ్.. 39 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. రెండు సిక్సర్లు కొట్టిన సూర్య.. ఎల్లీస్ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతికి స్టోయినిస్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. సూర్య నిష్క్రమించిన తర్వాత వచ్చిన నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా బంతిని బాదడమే పనిగా పెట్టుకోవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

