INDvsAFG 1st T20I: రాణించిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..!
INDvsAFG 1st T20I: సీనియర్ బ్యాటర్ మహ్మద్ నబీకి తోడు అజ్మతుల్లా ఒమర్జయ్ నిలవడంతో అఫ్గాన్ భారత్ ఎదుట మోస్తారు టార్గెట్‌ను నిలిపింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
INDvsAFG 1st T20I: మొహాలీ వేదికగా భారత్ – అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. అఫ్గాన్ బ్యాటర్లను ఆది నుంచి కట్టడి చేసిన భారత బౌలర్లు.. ఆ జట్టును 158 పరుగులకే కట్టడి చేశారు. సీనియర్ బ్యాటర్ మహ్మద్ నబీ (27 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడు అజ్మతుల్లా ఒమర్జయ్ (22 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) నిలవడంతో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (33/2), అక్షర్ పటేల్ (23/2) లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్.. 20 ఓవర్లలో 159 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), ఇబ్రహీం జద్రాన్ (22 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్సర్) లు తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వేగంగా పరుగులు చేయలేకపోయినా ఈ ఇద్దరూ వికెట్ కాపాడుకున్నారు. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. రెండు ఓవర్ల పరిదిలోనే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి గుర్బాజ్ స్టంపౌట్ అయ్యాడు. మరుసటి ఓవర్లో శివమ్ దూబే.. రెండో బంతికి జద్రాన్‌ను ఔట్ చేశాడు. అక్షరే వేసిన తర్వాతి ఓవర్లో రహ్మత్ షా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆదుకున్న నబీ-అజ్మతుల్లా..
ఏడు ఓవర్లకు 49-0గా ఉండి పది ఓవర్లకు 57-3గా ఉన్న అఫ్గాన్‌ను సీనియర్ బ్యాటర్లు మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జయ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి అజ్మతుల్లా స్లాగ్ స్వీప్‌తో భారీ సిక్సర్ బాదగా నబీ రెండు బౌండరీలు కొట్టాడు. ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. దీంతో అఫ్గాన్ స్కోరు వంద పరుగుల మైలురాయిని దాటింది. ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో నబీ రెండు వరుస సిక్సర్లు బాదాడు. ఈ జోడీని ముకేశ్ విడదీశాడు. అతడు వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన అజ్మతుల్లా వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో 43 బంతుల్లోనే 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి నబీ కూడా.. రింకూ సింగ్ చేతికి చిక్కాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 19వ ఓవర్లో 13 పరుగులు రాబట్టిన అఫ్గాన్ బ్యాటర్లు.. చివరి ఓవర్లో మూడు బౌండరీలు సాధించారు. నజీబుల్లా జద్రాన్ (11 బంతుల్లో 19, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

