మియామి: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద.. క్రిప్టో కప్‌లో జోరు కనబరుస్తున్నాడు. చాంపియన్స్ చెస్ టూర్లో భాగంగా ఇప్పటికే రెండు విజయాలు ఖాతాలో వేసుకున్న ప్రజ్ఞానంద.. గురువారం మూడో రౌండ్లో 2.5-1.5తో హన్స్ నైమన్ను చిత్తుచేశాడు.
మూడు రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లు సాధించిన 17 ఏండ్ల ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో కలిసి టాప్‌లో కొనసాగుతున్నాడు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన ప్రజ్ఞానంద.. రెండో గేమ్‌ను డ్రా చేసుకొని.. మిగిలిన రెండు గేమ్‌ల్లో విజయదుంధుబి మోగించాడు.