Candidates Chess Tourney | టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల టైటిల్ వేట కొనసాగుతున్నది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మన యువ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఙానంద(4), గుకేశ్(4), విదిత్ గుజరాతీ(3.5) మెరుగైన ప్రదర్శనతో టైటిల్‌ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇయాన్ నెపోమియాచి(4.5) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిదో రౌండ్లో ఫిరౌజ అలీరెజాతో ప్రజ్ఞానంద, గుకేశ్‌తో విదిత్ తలపడనున్నారు.