Bajarang Punia | స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు
Bajarang Punia | భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. పునియాను గతంలోనే నిషేధం విధించగా.. తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.
Bajarang Punia | భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. గతంలోనే పునియాపై నాడా వేటు వేయగా.. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చిన నాడా.. తాజాగా మళ్లీ వేటు వేసింది.
పునియాపై గతంలో నాడా విధించిన సస్పెన్షన్‌ను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ సంఘం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం మార్చి 10న సోనెపట్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్న భజరంగ్ పునియా సెమీ ఫెనల్స్లో ఔటయ్యాడు. అనంతరం డోపింగ్ పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. పునియా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది.
ఈ సస్పెన్షన్‌పై అప్పుడే స్పందించిన పునియా.. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని తెలిపారు. శాంపిల్ తీసుకునేందుకు అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగించినందున వివరణ అడిగానని చెప్పారు. ఇప్పటివరకు కూడా నాడా నుంచి ఎలాంటి నోటీసు అందలేదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ సంఘం ( ఏడీడీపీ)తో పేర్కొన్నారు. పునియా వివరణ నేపథ్యంలో అతనిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల ఏడీడీపీ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

