న్యూఢిల్లీ: యూత్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తాచాటారు. మెక్సికో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంక్ష కిషోర్, విజయ్ ప్రజాపతి రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆకాంక్ష 127 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 59 కేజీలు ఎత్తిన ఆకాంక్ష.. క్లీన్ అండ్ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తింది. మరోవైపు విజయ్ 175 కేజీలు ఎత్తి రజత పతకం ఖాతాలో వేసుకున్నాడు. పోటీల తొలి రోజు శనివారం కూడా భారత లిఫ్టర్లు రెండు రజత పతకాలు చేజిక్కించుకోవడంతో.. మన ఖాతాలో మొత్తం 4 పతకాలు చేరాయి.