Indian Hockey Team : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు(Indian Hockey Team) జోరు కొనసాగిస్తోంది. కేప్ టౌన్లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 3-0తో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh), అభిషేక్(Abhishek), సుమిత్ (Sumit)లు తలొక గోల్ కొట్టారు. సఫారీ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు.
ఆట మొదలైన రెండో నిమిషంలోనే భారత్ తొలి గోల్ కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ డ్రాగ్‌ఫ్లిక్‌తో సూపర్ గోల్ అందించాడు. అనంతరం 13 వ నిమిషంలో అభిషేక్ భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో సమిత్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. రెండో అర్థభాగంలో దక్షిణాఫ్రికా అటాకింగ్ గేమ్ ఆడినప్పటికీ.. భారత డిఫెండలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. దాంతో టీమిండియా బంపర్ విక్టరీ కొట్టింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన నెదర్లాండ్స్ జట్టును ఢీకొట్టనుంది.