Lal Salaam | గత ఏడాది ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి లాల్‌సలామ్ (Lal Salaam). రజినీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు. జలాలీ అంటూ ఈ పాట సాగగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ A R రెహమాన్, శరత్ సంతోష్ కలిసి పాడరు. మషూక్ రెహమాన్, ఏ ఆర్ రెహమాన్ లిరిక్స్ అందించగా.. రెహమాన్ మ్యూజిక్ సమకూర్చాడు. ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
లైకా ప్రోడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, మరియు తంగదురై ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.