చెన్నై : భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి మంగళవారం ప్రొ లీగ్ ఆన్లైన్ మ్యాచ్‌లో చెస్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై సంచలన విజయం నమోదు చేశాడు. చెక్‌మేట్ అవకాశాన్ని చేజార్చుకున్న కార్ల్సన్ తప్పిదాన్ని గుజరాతి సద్వినియోగం చేసుకుని విజయం సాధించాడు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జట్లు తలపడే ఈ ఆన్లైన్ టోర్నీలో భారత బృందం ఇండియన్ యోగిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా, కార్ల్సన్ బృందం కెనడా చెస్బ్రాస్ జట్టుకు ఆడారు.