న్యూఢిల్లీ: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. గురువారం మన దేశానికే చెందిన అదిబన్తో జరిగిన చివరి రౌండ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద అత్యధిక పాయింట్లతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరత్ కోటి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో గ్రాండ్‌మాస్టర్ నందిత చాంపియన్‌గా నిలిచింది.