పాక్ బ్యాటర్ రిజ్వాన్‌ను కాపాడింది ఇండియన్ డాక్టరే !

దుబాయ్: పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌కు ముందు రెండు రోజుల హాస్పిటల్లో ఐసీయూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తీవ్రమైన ఛాతి ఇన్ఫెక్షన్కు అతను చికిత్స పొందాడు. అయితే భారత్‌కు చెందిన పల్మనాలజిస్ట్ షహీర్ సైనాలాబ్దిన్ పాక్ బ్యాటర్‌కు చికిత్సను చేశాడు. మిడియోర్ హాస్పిటల్లో బ్యాటర్ రిజ్వాన్ రెండు రోజుల పాటు ఐసీయూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే రిజ్వాన్ కోలుకున్న తీరు పట్ల డాక్టర్ షహీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముజే కేల్నా హై.. టీమ్ కే సాత్ రహెనా హై అంటూ రిజ్వాన్ చికిత్స సమయంలో డాక్టర్లకు చెప్పాడట. ఆసీస్‌తో మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్ ఆడిన రిజ్వన్ 52 బంతుల్లో 67 రన్స్ చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిన విషయం తెలిసిందే. నాకౌట్ మ్యాచ్‌ను ఆడాలని రిజ్వాన్‌కు ఉందని, చాలా నమ్మకంతో ఉన్నాడని, అతను కోలుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని డాక్టర్ షహీర్ తెలిపాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు రిజ్వాన్ తీవ్రమైన జ్వరంతో ఇబ్బందిపడ్డాడు. దగ్గు, ఛాతి నొప్పి ఉందన్నాడు. హాస్పిటల్లో చేరడానికి 3 రోజుల ముందు రిజ్వాన్ ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. మొదట పాక్ జట్టు మెడికల్ టీమ్ అతనికి ప్రథమ చికిత్స చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో అతనికి 10-10 నొప్పి ఉందని డాక్టర్లు చెప్పారు. లారింజియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈసోఫాగల్ స్పాజమ్ వచ్చిందని, దాంతో ఊపిరితిత్తులు కూడా బిగిసిపోయినట్లు డాక్టర్ షహీర్ తెలిపాడు. ఆహారవాహికలో కణజాలం గట్టిపడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రిజ్వాన్‌ను ఐసీయూలో చేర్చిన డాక్టర్లు అతని కండీషన్‌ను 24 గంటలు మానిటర్ చేశారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ నుంచి రిజ్వాన్ రికవరీ అయిన తీరు అసాధారణమని డాక్టర్ షహీర్ చెప్పారు. సుమారు 35 గంటల పాటు రిజ్వాన్ ఐసీయూలో ఉన్నాడని, అతను ప్రదర్శించిన తెగువ, సామర్ధ్యం అద్భుతమన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
కారేపల్లిలో నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు
విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

