భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు సరైన శుభారంభం దక్కలేదు. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 4-5 తేడాతో ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున ఉత్తమ్‌సింగ్(10ని), సంజయ్(15ని, 57ని, 58ని) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ఆది నుంచి జోరు కనబరిచిన ఫ్రాన్స్ జట్టులో క్లెమెంట్ తిమోథీ(1ని, 23ని,32ని) హ్యాట్రిక్ గోల్స్ చేయగా, బెంజమిన్(7ని), సెలియార్(48ని) ఆకట్టుకున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మొదటి నిమిషంలో కెప్టెన్ క్లెమెంట్ ఫీల్డ్ గోల్‌తో ఫ్రాన్స్1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫ్రాన్స్ స్ట్రైకర్లు మెరుపు దాడులకు పాల్పడ్డారు. ఫ్రాన్స్ భారీ విజయం దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో ఆఖర్లో సంజయ్ వరుస గోల్స్‌తో టీమ్ఇండియా పరువు దక్కించుకుంది.