IND vs RSA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టెస్టుకు ఊహించినట్టుగానే వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ ఔట్‌ఫీల్డ్ తడిగా ఉంది. దాంతో అనుకున్న సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా టాస్ వేయనున్నారు. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టే సెంచూరియన్‌లో సోమవారం రాత్రి భారీ వర్షం కరిసింది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.