IND vs SL | మూడో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. 317 పరుగుల తేడాతో లంక చిత్తు
శ్రీలంకపై భారీ విజయం.. 3-0తో సిరీస్ నెగ్గిన భారత్
IND vs SL : మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడిచింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. అతని పేస్ దెబ్బకు టపటపా వికెట్లు కోల్పోయింది. కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చరిత అసలంక (1)లను సిరాజ్ అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లో లంక కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్, కోహ్లీ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 390 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ (166)లు సెంచరీలతో చెలరేగారు. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ తర్వాత వేగం పెంచిన కోహ్లీ 106 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. భారత గడ్డ మీద తక్కువ బంతుల్లో 150 స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (42), అయ్యర్ (38), రాహుల్ (7), సూర్య (4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. లంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. కరుణరత్నే, కసున్ రజిత తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

