IND vs SL | దంచేసిన సూర్య.. పడగొట్టిన బౌలర్లు.. తొలి టీ20లో టీమిండియా జయభేరి
IND vs SL : పొట్టి ప్రపంచ కప్ విజేత భారత జట్టు మరో సిరీస్ను విజయంతో ఆరంభించింది. ఆతిథ్య శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. ఛేదనలో లంకను 170కే ఆలౌట్ చేసిన భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
IND vs SL : పొట్టి ప్రపంచ కప్ విజేత భారత జట్టు మరో సిరీస్ను విజయంతో ఆరంభించింది. ఆతిథ్య శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. పల్లెకెలె స్టేడియంలో హిట్టర్లు దంచేయగా టీమిండియా 213 పరుగులు చేసింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సూర్యకుమార్ యాదవ్(58) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. రిషభ్ పంత్(49), ఓపెనర్ యశస్వీ జైస్వాల్(45)లు సైతం వీరవిహారం చేయడంతో లంకకు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంకను 170కే ఆలౌట్ చేసిన భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ నిర్దేశించిన భారీ ఛేదనను లంక ఓపెనర్లు పథుమ్ నిశాంక(79), కుశాల్ మెండిస్(వికెట్ కీపర్)లు ధాటిగా ఆరంభించారు. పవర్ ప్లేలో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించారు. దాంతో, లంక స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్కు 84 రన్స్ జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అర్ష్దీప్ సింగ్ విడదీశాడు. దాంతో, లంక స్కోర్ నెమ్మదించింది. కుశాల్ పెరీరా(20) అండగా రెచ్చిపోయిన నిశాంక భారత శిబిరంలో గుబులు రేపాడు. 15వ ఓవర్ తొలి బంతికి అతడిని బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో రెండో ఫోర్లు బాదిన పెరీరాను సైతం వెనక్కి పంపాడు. అక్కడితో లంక పతనం మొదలైంది. బిష్ణోయ్ బౌలింగ్లో కెప్టెన్ చరిత అసలంక(0) ఔట్ కాగా.. ఆ తర్వాత రియాన్ పరాగ్ వేసిన ఓవర్లో ఆతిథ్య జట్టు దసున్ శనక(0), కమిందు మెండిస్(12)లను కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది.
Pathum Nissanka falls after giving Sri Lanka a solid platform 💪https://t.co/fozZBSbiLQ #SLvIND pic.twitter.com/AB13nN8EVk
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2024
యశస్వీ, గిల్ దూకుడు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు. తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో 5ఓవర్లకే స్కోర్ 50 దాటింది. అయితే.. దిల్షాన్ మధుశనక ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది చివరి బంతికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బంతి అందుకున్న వనిందు హసరంగ() డేంజరస్ యశస్వీని బోల్తా కొట్టించాడు. డిఫెన్స్ ఆడబోయిన యశస్వీని వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ స్టంపౌట్ చేశాడు. దాంతో, టీమిండియా 74 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.

చిచ్చరపిడుగులు ఇద్దరూ ఔట్ కావడంతో లంక బౌలర్లు బతికిపోయామురా అన్నట్టు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఆ తర్వాత సునామీలా సూర్యకుమార్ యాదవ్(58) లంకను హడలెత్తించాడు. తన ట్రేడ్మార్క్ సుప్లా షాట్లతో అలరిస్తూ మళ్లీ స్కోర్బోర్డులో ఊపు తెచ్చాడు. అర్ధ సెంచరీతో చెలరేగిన సూర్యకు రిషభ్ పంత్() చక్కని సహకారం అందించాడు. పథిరన ఓవర్లో సూర్య వెనుదిరిగాక గేర్ మార్చిన పంత్ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్స సెంచరీకి చేరువైన పంత్ను వెనక్కి పంపిన ఈ యార్కర్ కింగ్ నాలుగు వికెట్లతో రాణించాడు. దాంతో, భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 213 రన్స్ చేసింది. టీ20ల్లో శ్రీలంకపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

