Junior Hockey World Cup : జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు(India).. కొరియాపై ఘన విజయం సాధించింది. చిలీలో జరుగుతున్న ఈ టోర్నీలో 9వ, 12వ క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో టీమిండియా 3-1తో కొరియాను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత అమ్మాయిలు కొరియా గోల్‌పోస్ట్‌పై దాడికి దిగారు.
అయితే.. కొరియా ప్లేయర్ జియున్ చోయి 19వ నిమిషంలో గోల్ చేసింది. కానీ ఆ సంతోషం కొరియాకు ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే..? ఆ తర్వాత టీమిండియా కౌంటర్ అటాక్‌తో ఆ జట్టును బెంబేలెత్తించింది. రోప్ని కుమారి(Ropni Kumari) 23వ నిమిషంలో తొలి గోల్ కొట్టి స్కోర్ సమం చేసింది. అక్కడి నుంచి మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.
ముంతాజ్ ఖాన్ 44వ నిమిషంలో గోల్ చేయడంతో కొరియా ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. చివర్లో అన్ను 46వ నిమిషంలో గోల్ చేయడంతో టీమిండియా 3-1తో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ సీలో 9వ స్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టు చిలీ లేదా అమెరికాతో తలపడనుంది.