Savita Punia | ‘గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. మూడోసారి రేసులో భారత హాకీ కెప్టెన్
Savita Punia : భారత మహిళల జట్టు కెప్టెన్ సవితా పూనియా(Savita Punia) అరుదైన ఘనతకు చేరువైంది. ఎఫ్ఐహెచ్(FIH) ఏటా అందించే 'గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్'(Goal Keeper Of The Year) అవార్డుకు వరుసగా మూడోసారి నామినేట్ అయింది. ఇప్పటికే రెండు పర్యాయాలు...
Savita Punia : భారత మహిళల జట్టు కెప్టెన్ సవితా పూనియా(Savita Punia) అరుదైన ఘనతకు చేరువైంది. ఎఫ్ఐహెచ్(FIH) ఏటా అందించే ‘గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్'(Goal Keeper Of The Year) అవార్డుకు వరుసగా మూడోసారి నామినేట్ అయింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ అవార్డు అందుకున్న సవితా ఈసారి విజేతగా నిలిస్తే హ్యాట్రిక్ సాధిస్తుంది.
‘వరుసగా రెండు సంవత్సరాలు నేను ఈ అవార్డు గెలుస్తానని, మళ్లీ మూడోసారి కూడా నామినేట్ అవుతానని అనుకోలేదు. నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు జట్టు సభ్యులకు ఇది చాలా గర్వకారణం’ అని సవితా తెలిపింది. వరుసగా 2021, 2022లో సవితా గోల్ కీపర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు అందుకుంది.

సవితా నేతృత్వంలోని భారత జట్టు ఈ ఏడాది అద్భుతంగా రాణించింది. నిరుడు స్పెయిన్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ విజేతగా అవతరించింది. దాంతో, భారత జట్టుకు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2023-04 ప్రమోషన్ దక్కింది. అంతేకాదు చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా గేమ్స్‌లో భారత్ కాంస్య పతకంతో మెరిసింది.
ఒలింపిక్స్ బెర్తు లక్ష్యంగా
వచ్చే ఏడాది ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ బెర్తుపై కన్నేసిన భారత హాకీ జట్టు.. సొంతగడ్డపై జనవరిలో ఎఫ్ఐహెచ్ హాక ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీ ఆడనుంది. గ్రూప్ బిలో ఇండియాతో పాటు న్యూజిలాండ్, అమెరికా, ఇటలీ ఉండగా.. గ్రూప్ ఏలో జర్మనీ, జపాన్, చిలీ, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో టాప్ -3లో నిలిస్తే ఒలింపిక్స్ బెర్తు ఖరారైనట్టే.
ఇవి కూడా చదవండి
-
Layoffs | టెక్ స్టార్టప్స్‌లో లేఆఫ్స్ కలకలం : 120 మంది ఉద్యోగులపై ఫిజిక్స్‌వాలా వేటు
-
CM KCR | ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఫిట్నెస్ పన్ను రద్దు చేస్తామని ప్రకటన..!
-
CM KCR | కాంగ్రెస్ పాలనలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయాయి : సీఎం కేసీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

