T20 World Cup | వామప్ మ్యాచ్‌లకు వేళైంది.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్‌ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్‌కప్ జోష్‌తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి.
T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్‌ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్‌కప్ జోష్‌తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి. ఆతిథ్య భారత్ ఫిబ్రవరి 4న గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా (South Africa)తో, ఫిబ్రవరి 6న గ్రూప్ ఏలోని నమీబియాతో తలపడనుంది. భారత జట్టు మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చని ఐసీసీ తెలిపింది.
పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న షురూ కానుంది. ఇప్పటికే సన్నాహక సిరీస్‌లు ఆడిన అన్ని జట్లు.. వామప్ మ్యాచ్‌లతో తమ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకోనున్నాయి. స్వదేశంలో వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ ఆత్మవిశ్వాసంతో వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 2న తొలి వామప్‌లో అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్ జట్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఢీకొంటాయి. అనంతరం.. సాయంత్రం 5 గంటలకు నవీ ముంబైలో ఇండియా ఏతో యూఎస్ఏ తలపడనుంది. రాత్రి 7 గంటలకు చెన్నైలో కెనడా, ఇటలీ మ్యాచ్ ఉంటుంది.
It’s time for the ICC Men’s #T20WorldCup 2026 warm-up fixtures 👊
Here’s how you can catch all the action LIVE 📺👇https://t.co/AVXYwfct6z
— ICC (@ICC) February 2, 2026
ఫిబ్రవరి 3న.. మూడు వామప్ మ్యాచ్‌లు, ఫిబ్రవరి 4వ తేదీన నాలుగు, ఫిబ్రవరి 5వ తేదీన నాలుగు, ఫిబ్రవరి 6న రెండు వామప్స్ ఉంటాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇండియా, నమీబియా మ్యాచ్‌తో వామప్ మ్యాచ్‌లు ముగుస్తాయి. భారత జట్టు మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్, ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఐసీసీ.టీవీలో వీక్షించవచ్చని ఐసీసీ వెల్లడించింది. యూఎస్ఏతో మ్యాచ్‌కు భారత ఏ జట్టు కెప్టెన్‌గా ఆయుష్ బదొని వ్యవహరించనున్నాడు. సర్జరీ నుంచి కోలుకున్న తిలక్ వర్మ (Tilak Varma) ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు.
ఫిబ్రవరి 2 :
1. అఫ్గనిస్థాన్ vs స్కాట్లాండ్ – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
2. యూఎస్ఏ vs భారత ఏ – డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై( సాయంత్రం 5 గంటలకు)
3. కెనడా vs ఇటలీ – ఎం.ఎ చిదంబరం స్టేడియం, చెన్నై(రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 3 :
1. ఒమన్ vs శ్రీలంక ఏ – కొలంబో క్రికెట్ క్లబ్ గ్రౌండ్, కొలంబో(మధ్యాహ్నం 1 గంటకు)
2. నెదర్లాండ్స్ vs జింబాబ్వే – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో(మధ్యాహ్నం 3 గంటలకు)
3. నేపాల్ vs యూఏఈ – ఎం.ఎ చిదంబరం స్టేడియం, చెన్నై(సాయంత్రం 5 గంటలకు)
ఫిబ్రవరి 4
1. స్కాట్లాండ్ vs నమీబియా – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2, బెంగళూరు (మధ్యాహ్నం 1 గంటలకు)
2. అఫ్గనిస్థాన్ vs వెస్టిండీస్ – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు (మధ్యాహ్నం 3 గంటలకు)
3. పాకిస్తాన్ vs ఐర్లాండ్ – ఎస్ఎస్సీ క్రికెట్ గ్రౌండ్, కొలంబో(సాయంత్రం 5 గంటలకు)
4. భారత్ vs దక్షిణాఫ్రికా – డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై (రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 5
1. జింబాబ్వే vs ఒమన్ – కొలంబో క్రికెట్ క్లబ్ గ్రౌండ్, కొలంబో(ఉదయం 11 గంటలకు)
2. నేపాల్ vs కెనడా – ఎం.ఏ. చిదంబరం స్టేడియం, చెన్నై(మధ్యాహ్నం 1 గంటకు)
3. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో(సాయంత్రం 5 గంటలకు)
4. న్యూజిలాండ్ vs యూఎస్ఏ – డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై (రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 6
1. ఇటలీ vs యూఏఈ -ఎం.ఏ. చిదంబరం స్టేడియం, చెన్నై(మధ్యాహ్నం 3 గంటలకు)
2. భారత్ vs నమీబియా – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు (సాయంత్రం 5 గంటలకు)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

