IND vs SL : శ్రీలంక కష్టాల్లో పడింది. కెప్టెన్ దసున్ షనక(4)ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. లెగ్ స్టంప్‌కు తాకింది. దాంతో, షనక నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు ఓపెనర్ నవనిదు ఫెర్నాండో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లేని పరుగుకు ప్రయత్నించాడు. క్యాచ్ మిస్ చేసిన శుభ్‌మన్ గిల్ కీపర్ రాహుల్‌కు వైపు బంతిని విసిరాడు. బంతి అందుకున్న కేఎల్ రాహుల్ వికెట్లను గిరాటేశాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. షమి, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్‌లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్థ శతకం పూర్తి చేశాడు. అతను కుశాల్ మెండిస్‌తో కలిసి 62 బంతుల్లో 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చరిత అసలంక 12, కెప్టెన్ దసున్ షనక 1 రన్‌తో ఆడుతున్నారు. 23 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 123 రన్స్ చేసింది.