IND vs SL : శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న మెండిస్, ఫెర్నాండో జోడీని కల్దీప్ యాదవ్ విడదీశాడు. చైనామన్ స్పిన్సర్ మెండిస్‌ను (34) ఎల్బీగా వెనక్కి పంపాడు. అతను ఓపెనర్ నవనిదు ఫెర్నాండోతో కలిసి 60 బంతుల్లో 73పరుగులు జోడించాడు. ప్రస్తుతం ఫెర్నాండో (47), చరిత అసలంక (3) క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 110 రన్స్ చేసింది.