IND vs SL | వర్షం కారణంగా ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి చేరువలో భారత్
IND vs SL : ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది.
IND vs SL : ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంక 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, వర్షం కారణంగా ఈ రోజు ఆటను త్వరగా ముగించాల్సి వచ్చింది.
క్రీజులో సోనాల్ దినుషా 7 పరుగులతో, కేషర నువాంతా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బుధవారం ఉదయం శ్రీలంక 265/8 వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆ తర్వాత ఐదు ఓవర్లలోనే 290 పరుగులు చేసి, ఆలౌటైంది. దీంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు ఫాలో ఆన్ ఆడే అవకాశం కల్పించింది టీమిండియా. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఐదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లాహిరు ఉదార 3 పరుగులకే ఔటయ్యాడు.
తర్వాత 63 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత 115 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. లంక బ్యాటర్లలో సూర్య బండారా 92 పరుగులు చేసి, జట్టుకు అండగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉండటం విశేషం. అలాగే, కమిందు మెండిస్ 55 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత 209 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్, 212 పరుగుల వద్ద ఐదో వికెట్, 218 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో 229 పరుగులకు చేరుకుంది. అయితే, వర్షం కారణంగా ఆటను త్వరగా ముగించాల్సి వచ్చింది.
ఆరు వికెట్లు కోల్పోయిన లంక 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. గురువారం ఆట జరిగే తీరుపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. శ్రీలంకను భారత బౌలర్లు చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ఇండియా రెండో టెస్టులో కూడా ఘన విజయం సాధించడం ఖాయం. అయితే, ఆటకు వర్షం ఆటకు కలిగించే అవకాశాలున్నాయి. వర్షం పడకుంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

