IND vs NZ : చైనామన్ బౌలర్ కుల్దీప్ భారత్‌కు మూడో వికెట్ అందించాడు. నికోలస్‌ను బౌల్డ్ చేశాడు. డ్రింక్స్ అనంతరం కుల్దీప్ వేసిన ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టిన నికోలస్ మూడో బంతికి వెనుదిరిగాడు. కీలకమైన మూడు వికెట్లు పడిపోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఆ జట్టు విజయానికి 34 ఓవర్లలో 271 రన్స్ కావాలి. 15 ఓవర్లకు కివీస్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. మిచెల్ 4, లాథమ్ 1తో ఆడుతున్నారు. అంతకు మందు ఓవర్లో లార్డ్స్ శార్థూల్, కీలకమైన అలెన్ ఫిన్ వికెట్ తీసి భారత్ బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్నఅతను డీప్ మిడ్ వికెట్ మీదుగా ఇచ్చిన క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ ఒడిసి పట్టుకున్నాడు.