IND vs NZ : భారత బౌలర్లు సిరాజ్, షమీ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుడడంతో కివీస్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. దాంతో, పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 41 రన్స్ మాత్రమే చేసింది. అలెన్ 17, నికోలస్ 10 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. లోకల్ బాయ్ సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందిందాడు. అతని బౌలింగ్‌లో డ్వేన్ కాన్వే (10) అవుట్ అయ్యాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లో రెండొందలు సాధించాడు.