ముంబై టెస్టులో అశ్విన్ చెలరేగుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. బౌలింగ్‌కు వస్తే చాలు వికెట్ తీసేందుకు అన్నట్లు అతని బౌలింగ్ సాగుతోంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో కివీ కెప్టెన్ టామ్ లాథమ్ (6)ను అవుట్ చేసిన అతను.. మరో ఓపెనర్ విల్ యంగ్ (20)ను కూడా పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన వెంటనే వెటరన్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (6)ను అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన టాస్డ్ బంతిని స్లాగ్ షాట్ ఆడేందుకు టేలర్ ప్రయత్నించాడు. అయితే అది గాల్లోకి లేచింది. లెగ్ స్లిప్‌లో ఉన్న పుజారా ఆ క్యాచ్ అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకూ న్యూజిల్యాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోగా.. ఈ మూడూ అశ్విన్ తీసిన వికెట్లే.