IND vs ENG | అంతర్జాతీయ కెరీర్లో వందో టెస్టు అంటే ఎవరికైనా ప్రత్యేకమే. ఈ మ్యాచ్లో తమ ఆట మరింత ప్రత్యేకంగా ఉండాలని ఏ క్రికెట్ అయినా కోరుకుంటాడు. కానీ భారత సీనియర్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం వందో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన ఆష్ అన్న.. బ్యాటింగ్లో మాత్రం డకౌట్ అయ్యాడు. తద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా రెండో రోజు ఆటలో.. అశ్విన్ ఐదు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. టామ్ హర్ట్లీ బౌలింగ్లో అశ్విన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వందో టెస్టులో డకౌట్ అయిన ఆటగాళ్లలో అశ్విన్ మూడో ఆటగాడు కాగా అంతర్జాతీయ స్థాయిలో 8వ ప్లేయర్. ఇంటర్నేషనల్ లెవల్లో వందో టెస్టు ఆడుతూ సున్నా పరుగులకే ఔట్ అయినవారిలో భారత్ నుంచి ఇన్నాళ్లూ దిలీప్ వెంగ్సర్కార్, ఛతేశ్వర్ పుజారాలు ఉండగా తాజాగా ఆ జాబితాలో అశ్విన్ చేరాడు.
వందో టెస్టులో డకౌట్ అయిన ఆటగాళ్లు..