IND vs ENG 2nd Test: భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యం
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో సెషన్లో భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
IND vs ENG 2nd Test: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత్‌కు 398 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో సెషన్లో భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. కానీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( 61 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరిపోరాటం చేసి భారత ఆధిక్యాన్ని 400 పరుగులకు అత్యంత చేరువగా తీసుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని భారత్.. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (6) మరోసారి విఫలమవగా కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యాడు. బుమ్రా వికెట్లకు అడ్డంగా నిలబడ్డాడు. 26 బంతులాడిన బుమ్రా పరుగులేమీ చేయనప్పటికీ అశ్విన్‌తో కలిసి 9 వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అశ్విన్ తర్వాత వచ్చిన ముగ్గురు లోయరార్డర్ బ్యాటర్లు (కుల్దీప్, బుమ్రా, ముకేశ్ కుమార్)లు సున్నా పరుగులే వద్దే ఉండటం భారత్‌ను దెబ్బతీసింది. కుల్దీప్, బుమ్రాలు హర్ట్లీకి చిక్కగా అశ్విన్, భరత్‌లను అహ్మద్ ఔట్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్లీ నాలుగు వికెట్లు తీయగా రిహాన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్‌లో ఇవాళ మరో 16 ఓవర్ల ఆట మిగిలిఉంది. మరి భారత బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటారా..? లేక నిర్జీవమైన పిచ్‌పై ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు దాసోహమవుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత గడ్డపై ఇంత భారీ స్కోరు ఛేదించడం అంత ఈజీ కాకపోయినా ఇంగ్లండ్ దూకుడైన ఆట ఆడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

