IND vs BAN : 187 టార్గెట్‌ను చేధించే క్రమంలో బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయింది. తొలి బంతికే ఓపెనర్ శాంటోను అవుట్ చేసి దీపక్ చాహర్ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. లిటన్ దాస్ (41రన్స్), అనాముల్ హక్ (14రన్స్) పెవిలియన్ చేరిన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు షకిబుల్, ముష్పికర్ రహీం నిలకడగా ఆడారు. అయితే షకిబుల్‌ను ఔట్‌చేసి వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. దాంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. యువ బౌలర్ కుల్దీప్ సేన్ ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. వాషంగ్టన్ సుందర్ 2, దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన బంగ్లదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు భారత జట్టును 186 పరుగులకు ఆలౌట్ చేశారు. టీమిండియాలో కేహెల్ రాహుల్ 74 ఒక్కడే రాణించాడు. విరాట్ కోహ్లీ 9, ధావన్ 7, శ్రేయాస్ 24 పరుగులు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లీలను ఔట్ చేశాడు. పేసర్ హెబడాట్ హొసేన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.