సిడ్నీ: ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్; 19 ఫోర్లు, ఒక సిక్సర్), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరుపై కన్నేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు నెగ్గి సిరీస్ చేజిక్కించుకున్న ఆతిథ్య ఆసీస్.. ఆఖరి పోరులోనూ అదే జోరు కొనసాగిస్తున్నది. లబుషేన్ (79), హెడ్ (70) హాఫ్సెంచరీలు నమోదు చేసుకున్నారు. సఫారీ బౌలర్లలో నోర్జే 2 వికెట్లు పడగొట్టాడు. ఖవాజా కెరీర్లో తొలి డబుల్ సెంచరీకి చేరువ కాగా.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (29) అధిగమిస్తూ స్మిత్ 30వ శతకం తన పేరిట రాసుకున్నాడు.