హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) దుమ్మురేపుతున్నది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 6-1 తేడాతో నార్త్ఈస్ట్ యునైటెడ్పై భారీ విజయం సాధించింది. హెచ్ఎఫ్సీ తరఫున జేవియర్ సివేరియో (8ని, 73ని), బోర్జా (24ని), ఒడోయ్ (30ని), చియానిస్ (77ని), గౌరవ్బోరా (80ని, ఓన్గోల్) గోల్స్ చేశారు. నార్త్ఈస్ట్కు ఇవాన్స్ (36ని) ఏకైక గోల్ అందించాడు.