గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్లో హెచ్ఎఫ్సీ 3-0తేడాతో నార్త్ఈస్ట్ యునైటెడ్పై అద్భుత విజయం సాధించింది. ముంబై సిటీతో జరిగిన తొలి మ్యాచ్ను డ్రా చేసుకున్న హైదరాబాద్ మలి మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె (13ని), హలీచరణ్ (69ని) , బోర్జా (73ని) తలా ఒక గోల్ చేశారు.