Steve Smith : టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడు అంటూ తనపై వస్తున్న వదంతులను ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడి స్టీవ్ స్మిత్ కొట్టిపారేశాడు. ‘నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. ప్రస్తుతం నేను చాలా కంఫర్టబుల్‌గా ఉన్నా. ఈ ఏడాది రసవత్తరంగా ఉండే విదేశీ పర్యటనలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మరింత బాగా రాణించేందుకు ఎదురుచూస్తున్నా. నా గేమ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనే ఆలోచనే లేదు’ అని 33 ఏళ్ల స్మిత్ చెప్పాడు. ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్‌తో శుక్రవారం మాట్లాడాడు. తాను ఇప్పటికీ పరుగుల దాహంతో ఉన్నానని, తన గేమ్‌ను మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్మిత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు యువ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్నానని ఈ రన్ మెషిన్ తెలిపాడు.
సిడ్నీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ సెంచరీ (104)తో కదం తొక్కాడు. ఇది అతని 30వ టెస్టు సెంచరీ. దాంతో, సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డు(29 సెంచరీలు)ను బద్ధలు కొట్టాడు. ఈ సిరీస్‌లో స్మిత్‌కు ఇది రెండో సెంచరీ. వరుస సెంచరీలతో అతను టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఫిబ్రవరిలో ఆసీస్, భారత పర్యటనకు రానుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టులు ఆడనుంది.