2036 ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చడమే లక్ష్యం
భారత సాంప్రదాయ క్రీడ కబడ్డీని 2036 ఒలింపిక్స్‌లో చేర్చడమే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) పనిచేస్తోందని ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
- పీకేఎల్ తరహాలో మహిళల కబడ్డీ లీగ్
- ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత సాంప్రదాయ క్రీడ కబడ్డీని 2036 ఒలింపిక్స్‌లో చేర్చడమే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) పనిచేస్తోందని ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఐకేఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో జరిగే 2030 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కబడ్డీకి చోటు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 62 దేశాలు ఐకేఎఫ్ సభ్యత్వం పొందాయని, ఒలింపిక్స్‌లో కబడ్డీకి చోటు దక్కితే వివిధ దేశాలు ఈ క్రీడలకు నిధులు కేటాయించడంతో పాటు క్రీడాకారులకు అపార అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కబడ్డీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే కబడ్డీ వరల్డ్ కప్ నిర్వహణతో పాటు మహిళల కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించనుట్టు కాసాని ప్రకటించారు. ప్రో కబడ్డీ తరహాలోనే మహిళా అథ్లెట్లను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రత్యేక లీగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ డైరెక్టర్లు వెంకటేశ్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మలతో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

