స్టట్గార్ట్: పోర్ష్ గ్రాండ్ ప్రిక్స్ టెన్నిస్ (Porsche Tennis Grand Prix) చాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంకర్ ఇగా సియాటెక్ (Iga Swiatek) క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. పక్కటెముకల గాయంనుంచి కోలుకున్న తరువాత ఆడుతున్న తొలి టోర్నీలో సియాటెక్ ప్రిక్వార్టర్స్‌లో 6-1, 6-4తో జెంగ్ క్వినెన్పై గెలిచింది. గత నెలలో ఇండియన్ వెల్ష్ టోర్నీ తరువాత మియామి ఓపెన్, బిల్లీ జీన్ కింగ్ కప్ టోర్నీలకు దూరంగా ఉన్న సియాటెక్ ఆడుతున్న టోర్నీ ఇదే. సియాటెక్ తదుపరి క్వార్టర్ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాను ఢీకొంటుంది. ప్లిస్కోవా 6-2, 6-7(5-7), 7-6(7-5)తో డొనా వెకిక్‌పై గెలుపొంది సియాటెక్తో పోరుకు సిద్ధమైంది.