లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మూడో సీడ్ పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ బోణీ కొట్టింది. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్.. 6-1, 2-6, 6-3తో అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ టేలర్ టౌన్‌సెండ్‌పై గెలిచింది.
మరో పోరులో రెండో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్థాన్).. 6-4, 1-6, 6-3తో బొయిసన్ (ఫ్రాన్స్)ను ఓడించింది. మెన్స్ సింగిల్స్‌లో నొవాక్ జొకోవిచ్.. 6-4, 5-7, 6-4, 6-4తో వు యిబింగ్ను ఓడించి శుభారంభం చేశాడు. టేలర్ ఫ్రిట్జ్ ముందంజ వేయగా నాలుగో సీడ్ బెన్ షెల్టన్‌కు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు.