ICC Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్..!
ICC Rankings | టీ20 ప్రపంచకప్ కొనసాగుతుండగా.. ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆఫ్ఘన్ ఆటగాడు మహ్మద్ నబీని అధిగమించి ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ నెంబర్ వన్ ఆల్ రౌండ్‌గా నిలిచాడు.
ICC Rankings | టీ20 ప్రపంచకప్ కొనసాగుతుండగా.. ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆఫ్ఘన్ ఆటగాడు మహ్మద్ నబీని అధిగమించి ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ నెంబర్ వన్ ఆల్ రౌండ్‌గా నిలిచాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో స్టోయినిస్ ఆరు వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్‌తోనూ రాణించాడు. నబీ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
టీమిండియా ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో అద్భుతమైన బౌలింగ్‌తో పాండ్యా ఒక ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. టాప్-10 ఆల్రౌండర్లలో కేవలం టీమిండియా నుంచి కేవలం పాండ్యాకే చోటు దక్కింది. ఇక టీ20 బౌలర్స్ ర్యాంకింగ్ ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండిస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అఖిల్ హుస్సేన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏకంగా ఆరుస్థానాలను మెరుగుపరుచుకొని రెండో స్థానానికి చేరాడు. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మూడో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ నాలుగో స్థానంలోకి చేరాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్టేజే ఐదోస్థానం, ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్హాక్ ఫారూఖీ ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్‌వన్ స్థానంలో ఉన్నారు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంక్‌కు చేరుకోగా, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 43 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

