ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే బతికేవాడినే కాదేమో.. దిగ్గజ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

లండన్: జాతి వివక్ష అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఒకవేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే అసలు బతికి ఉండేవాడినే కాదేమో అని అన్నాడు. ఇవాళ నేను బతికి ఉండేవాడినని అనుకోవడం లేదు. యువకుడిగా ఉన్నప్పుడు నాకు చాలా ఆవేశం ఉండేది. న్యూజిలాండ్‌లో ఆడుతున్నప్పుడు స్టంప్‌ను బలంగా తన్నాను. దానిని బట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడినో మీరు అర్థం చేసుకోవచ్చు అని ది టెలిగ్రాఫ్‌తో హోల్డింగ్ అన్నాడు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి బలంగా మద్దతు తెలిపిన హోల్డింగ్.. జాతి వివక్షపై రాసిన Why We Kneel, How We Rise అనే బుక్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను ఓ పోలీస్ అధికారి హత్య చేసిన తర్వాత హోల్డింగ్ రేసిజం అంశంపై చాలా బలంగా మాట్లాడుతున్నాడు. జమైకాలో నేను పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ జాతి వివక్ష ఎదుర్కోలేదు. జమైకాను వదిలి బయటకు వచ్చినప్పుడల్లా జాతి వివక్ష ఎదుర్కొన్నాను. అలా జరిగిన ప్రతిసారీ.. ఇది నా జీవితం కాదులే. త్వరలోనే ఇంటికెళ్లిపోతాను అని తనకు తాను చెప్పుకునే వాడినని అన్నాడు.
ఒకవేళ నేను యువకుడిగా ఉన్నప్పుడే దీనిపై పోరాడి ఉంటే నా కెరీర్ ఇంత సుదీర్ఘంగా ఉండేది కాదు. టీవీ కెరీర్ కూడా అంతే. తమ హక్కుల కోసం పోరాడిన నల్లజాతీయులు బాధితులుగా మారిన ఉదంతాలు చరిత్రలో చూశాం. నేను మాట్లాడి ఉంటే నన్నూ చంపేసేవాళ్లు అని హోల్డింగ్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

