అహ్మాదాబాద్: రింకూ సింగ్(Rinku Singh) పవర్ షో.. ఐపీఎల్ లవర్స్‌ను థ్రిల్ చేసింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు.. చివరి నిమిషంలో రింకూ హిట్టింగ్తో కీలకమైన రెండు పాయింట్లను ఖాతాలో వేసుకున్నది. చివరి అయిదు బంతుల్లో వరుసగా అయిదు సిక్సులు కొట్టిన రింకూ ఇప్పుడో సూపర్‌స్టార్. పవర్ఫుల్ స్ట్రోక్స్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్.. గుజరాత్ బౌలర్‌ను ముంచేసింది. చివరి 5 బంతుల్లో 28 రన్స్ అవసరం కాగా.. రింకూ ఆ రేంజ్లో ఆడేశాడు. వరుసగా అయిదు సిక్స్‌లు కొట్టి .. కేకేఆర్ బృందంలో ఆశలు రేపాడు. ఆరు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో రింకూ.. 21 బంతుల్లో 48 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
𝗥𝗶𝗻𝗸𝘂 𝘁𝗼 𝘁𝗵𝗲 𝗿𝗲𝘀𝗰𝘂𝗲! 😎
When the twitter world went abuzz in admiration of @rinkusingh235's magical finish in Ahmedabad! 🙌#TATAIPL | #GTvKKR | @KKRiders pic.twitter.com/eskOWck54X
— IndianPremierLeague (@IPL) April 9, 2023
రింకూ లైఫ్ స్టోరీ ఓ పేదవాడి పోరాటమే. కేవలం 55 లక్షలకే రింకూను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ అతనిది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడతను. అతని తండ్రి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేవాడు. రింకూ యూపీ అండర్-19 జట్టు ఆడాడు. ఓ దశలో అతను డొమస్టిక్ వర్కర్‌గా చేశారు. తనకు ఉన్న 5 లక్షల అప్పును తీర్చేందుకు.. ఊడ్వడం, మాప్ వేయడం లాంటి పనులు కూడా చేశాడు. తండ్రి చాలా కష్టపడ్డాడని, రైతు కుటుంబం నుంచి వచ్చానని, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కొట్టిన ప్రతి షాట్.. తన కోసం జీవితాన్ని త్యాగం చేసినవారికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.
How a winning dressing room sounds like! 💜😍#GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/hTOJidtTnR
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2023
కేకేఆర్ అకాడమీలో రింకూ చాలా కష్టపడ్డాడు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఇటీవల రంజీల్లోనూ అతను రాణించాడు. నిజానికి గత ఏడాది ఐపీఎల్‌లోనూ రింకూ సింగ్ సూపర్ షో ప్రదర్శించారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతను 15 బంతుల్లో 40 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడినా.. అతని ఆటతీరు అందర్నీ ఆకట్టుకున్నది.
📞 Dial 66666 for epic finishes! 😌 https://t.co/RJg8ECkXXC
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2023
చివరిలో హిట్టింగ్ చేయగలన్న నమ్మకం ఉందని, గత ఏడాది లక్నోతో మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నానని, అప్పుడు కూడా నమ్మకంతో ఆడానని, ఎక్కువగా ఆలోచించకుండా.. ఒక్కొక్క షాట్ ఆడుతూ వెళ్లినట్లు రింకూ తెలిపాడు. చివరి సిక్సర్‌ను బ్యాక్ఫూట్లో కొట్టినట్లు చెప్పాడు.
𝘈𝘭𝘭 𝘩𝘢𝘪𝘭 𝘵𝘩𝘦 👑 🙌@rinkusingh235 | #GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/2NGoZi9001
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2023